కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ మొదటి బండ్ నుంచి నిలువ ఉన్న నీటిని పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సాగు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని రైతుల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ, ఆయకట్టు పరిధిలోని కొంత వరకైనా పంట పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్బంగా పోచారం సూచించారు. రైతుల అవసరాల కోసం కీలక దశలో పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

