అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సన్మానం

కలం, నిర్మల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ (Seva Sankalp) కార్యక్రమంలో భాగంగా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) అంగన్వాడీ టీచర్లకు శాలువాలు కప్పి సత్కరించి చీరలను అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, జిల్లా ఇన్‌చార్జి గోపిడి శ్రావణిరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>