మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. రూ.1,108 కోట్లు రిలీజ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతం మంచిరేవులలోని మూసీ ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర (Manchirevula Omkareshwara) ఆలయాభివృద్ధి, 6 వరుసల రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,108 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ఛైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ కో-ఛైర్మన్‌గా సాంకేతిక కమిటీని నియమించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభతో పాటు రవాణా సౌకర్యాలను విస్తరించేందుకు  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read : రేవంత్ రెడ్డిని చరిత్ర చెత్తబుట్టలో వేయడం ఖాయం: దేశపతి శ్రీనివాస్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>