నిజామాబాద్‌లో కాంగ్రెస్ ధర్నా.. సీఈసీ దిష్టిబొమ్మ దహనం

కలం, నిజామాబాద్ బ్యూరో : ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు సీఈసీకి వ్యతిరేకంగా నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా (Congress Protest) చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసనలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్.. బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 13 కోట్లు, తెలంగాణలో దాదాపు 90 లక్షలు, జిల్లాలో అర్బన్లో దాదాపు 80వేలకు పైగా ఓట్లు తొలగించారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేసివిధంగా ఈ ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని నగేష్ రెడ్డి మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో (Congress Protest) నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి రాములు , నగర మేయర్ ఉమారాణి, కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్, నూడా చైర్మన్ కేశ వేణు, నాయకులు గడుగు గంగాధర్, అరికెల నర్సారెడ్డి , ఆకుల లలిత, వినయ్ రెడ్డి, రామ్ భూపాల్, మహిళ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నగర కార్పొరేటర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>