బాలురపై లైంగిక వేధింపులు.. 9 నెలల్లో 62 పోక్సో కేసులు

కలం, వెబ్ డెస్క్: పిల్లల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. లైంగిక వేధింపులు (Sexual Abuse Cases) ఆగడం లేదు. బాలికలతో పాటు బాలురు సైతం వేధింపుల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 62 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురైనట్లు కేసులు నమోదయ్యాయి. 2024లో నలుగురు చిన్నారులు బాధితులుగా ఉండగా, 2025లో ఆ సంఖ్య 61కు పెరిగింది. అయితే 2026లో కేవలం తొమ్మిది నెలల్లోనే గతేడాది సంఖ్యను దాటి 62 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్‌లో అత్యధికంగా 9 కేసులు నమోదయ్యాయి. మిర్‌చౌక్, శంషాబాద్, మేడ్చల్‌లో చెరో 7 కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలి, హైదరాబాద్, కరీంనగర్, నిర్మల్, వరంగల్ ప్రాంతాల్లో చెరో 3 కేసులు నమోదయ్యాయి. కుటుంబ పరువు, సామాజిక భయాల కారణంగా మరెన్నో ఘటనలు వెలుగులోకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. పిల్లల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేయడంతో పాటు పబ్లిక్ ప్లేసులు, విద్యాలయాల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>