బీజేపీ దూకుడు.. యాదగిరిగుట్ట పట్టణ మోర్చాలకు కొత్త అధ్యక్షులు

కలం యాదగిరిగుట్ట: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడున్న యాదగిరిగుట్ట బీజేపీ (Yadagirigutta BJP).. పార్టీ బలోపేతంపై మరింత దృష్టి సారించింది. పార్టీ పటిష్టతలో భాగంగా పట్టణ కమిటీలో వివిధ మోర్చాలకు నూతన అధ్యక్షులను నియమించారు. పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నియామకాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే క్రియాశీలక నాయకులకు మోర్చా కమిటీల్లో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. నూతనంగా నియమితులైన అధ్యక్షులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నూతనంగా నియమితులైన మోర్చా అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

నూతన మోర్చా అధ్యక్షులు వీరే

మహిళా మోర్చా: ఆరుట్ల స్వాతి
ఓబీసీ మోర్చా: శివరాత్రి శ్రీశైలం
ఎస్టీ మోర్చా: రుద్రాక్ష నవీన్

Also Read : ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>