సామాజిక బహిష్కరణలపై బీసీ కమిషన్ కు ఫిర్యాదులు

కలం, నిజామాబాద్ బ్యూరో : సామాజిక బహిష్కరణ ఉదంతాలపై తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (TG BC Commission) కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మిలతో కూడిన బృందం బుధవారం నిజామాబాద్ (Nizamabad) లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధితులతో భేటీ అయ్యింది.

ఈ సందర్భంగా సాంఘిక, కుల బహిష్కరణలకు గురైన బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కమిషన్ (TG BC Commission) చైర్మన్, సభ్యులకు లిఖితపూర్వకంగా విజ్ఞాపనలు సమర్పించారు. బాధితులు నిర్బయంగా స్వేచ్ఛగా వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలోని ఆయా ప్రాంతాలలో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట కొనసాగుతున్న అరాచకాల గురించి, సామాజిక బహిష్కరణ ఘటనలను బాధితులు కమిషన్ కు ఏకరవు పెట్టారు.

బీసీ కుల సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారు, ప్రజా సంఘాల ప్రతినిధులు సైతం హాజరై రాతపూర్వకంగా విజ్ఞాపనలు కమిషన్ కు అందించడంతో పాటు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాంఘిక బహిష్కరణలపై ఫిర్యాదులు సమర్పించేందుకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Also Read : మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. రూ.1,108 కోట్లు రిలీజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>