రేవంత్ రెడ్డిని చరిత్ర చెత్తబుట్టలో వేయడం ఖాయం: దేశపతి శ్రీనివాస్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని శాసన మండలి బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు నిర్బంధాలు కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి సూట్ కేసులు మోయటం.. ప్రతిపక్షంపై కేసులు పెట్టడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో ప్రజల బ్రతుకులు పారడైజ్ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బ్రతుకుల్లా మారాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నీరో రాజ్యం కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు.

ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ నిర్మించాలి..

రేవంత్ రెడ్డిని చరిత్ర చెత్తబుట్టలో వేయడం ఖాయమని దేశపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సద్భుద్దిని దేవుడు ప్రసాదించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లాంటి ద్రోహుల వల్లే యువత బలిదానాలు జరిగాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పేరు రాసి మరీ కొందరు ఆత్మాహుతి చేసుకున్నారని..ఆయనకు అమరుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఇక ఎర్రవల్లి భూముల సర్వేపై స్పందించిన దేశపతి (Deshapathi Srinivas).. అసైన్డ్ భూమిలో అమరవీరుల కాలనీ ఎందుకు? అని ప్రశ్నించారు. అమరవీరులకు, దళితులకు తగాదా పెట్టవద్దని కోరారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో, కాంగ్రెస్ ప్రభుత్వం కడతనంటున్న ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు.

సమయం దగ్గర పడింది..

రేవంత్ రెడ్డికి సమయం దగ్గర పడిందని దేశపతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎంగా,హోంమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, విద్యా శాఖా మంత్రిగా తన పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న తన అనుయాయులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లను రద్దు చేశారని ఆరోపించారు. ప్రజలకు రీ కాల్ చేసే హక్కు ఉంటే ఈపాటికే రేవంత్ రెడ్డిని చెత్తబట్టులో పడేసేవారని ఎద్దేవా చేశారు.

నిరంతరం విషం చిమ్ముతున్నారు..

తమ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారని దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రతిపక్ష నేతల ఇళ్ళ వద్ద బందీలుగా మారారని అన్నారు. కాంగ్రెస్ నేతల బౌన్సర్ల లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల రిమాండ్‌ను కోర్టులు రిజెక్ట్ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బరితెగింపు పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో బారికేడ్లు ఎక్కి నిరసన చేస్తున్నారని మండిపడ్డారు.

బడే భాయ్.. చోటే భాయ్ అంటూ పంచులు..

ఢిల్లీలో బడే భాయ్ మోదీ కేసులు పెట్టట్లేదని.. ఇక్కడ చోటే భాయ్ కేడీ అరెస్టులు చేస్తున్నారని సీఎం రేవంత్ పై దేశపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పై ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బ్యూరోక్రాట్ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. ఎల్‌నినో వల్ల రైతులకు నీళ్ల కరువు ఉంది కానీ.. లిక్కర్‌కి మాత్రం నీళ్ల కరువు లేదని మంత్రి జూపల్లి కృష్ణరావు సగర్వంగా ప్రకటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని సంబంధాలు అంటగట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదా? అని ప్రశ్నించారు.

Also Read : మెస్సీ చివరి మ్యాచ్.. అదిరిపోయే వీడ్కోలు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>