తాండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తాండాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంబాయి తాండా నుంచి కొత్త తాండా వరకు ఎస్టీఎస్‌డీఎఫ్‌ నిధులతో రూ.1.06 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు బుధవారం ఆయన భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం యెన్నం (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. తాండాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్షాకాలంలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. గ్రామాలు, తాండాల మధ్య మెరుగైన రహదారి సౌకర్యం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పి. వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్నయ్య, స్థానిక సర్పంచులు సతీష్, బొట్టు శ్రీను, లింగం నాయక్, ఉప సర్పంచ్ నీలిబాయి రాజు, నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, జె వెంకటయ్య, యాదిరెడ్డి, చందర్ నాయక్, ఖలీం, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>