కలం, మహబూబ్నగర్ బ్యూరో: మహబూబ్నగర్ (Mahabubnagar) అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన (Youth Congress Protest) కార్యక్రమం చేపట్టారు. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులు ఎ.సంజీవ్ ముదిరాజ్ ఈ నిరసనలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలు, న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పోరాటం ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని సంజీవ్ ముదిరాజ్ తెలిపారు.

