13.39 కోట్ల ఓట్లు ఔట్.. EC రియాక్షన్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈసీ (EC) వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖుల దాక అనేక మంది ఓట్లు గల్లంతైన్నట్లు అంతటా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో SIR ప్రక్రియలో 13.39 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎన్నికల సంఘం ఖండించింది. మరణాలు, ఫేక్ ఓట్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు నమోదు (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీల్లో ఉన్నారని క్లారిటీ ఇచ్చింది.

ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. 3.01 కోట్లు గైర్హాజరు ఓటర్లు, 6.30 కోట్లు ఇతర ప్రాంతాలకు తరలినవారు, 2.80 కోట్లు మరణించినవారు, 1.02 కోట్లు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చినట్లు ఈసీ వెల్లడించింది.

Also Read : మెస్సీ చివరి మ్యాచ్.. అదిరిపోయే వీడ్కోలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>