మద్యానికి రాని ‘ఎల్ నినో’… కరెంట్‌కు, నీళ్లకు ఎందుకొస్తోంది?: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, ఎల్ నినో ఎఫెక్ట్‌పై అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెంట్ కోతలు విధించినా, సాగునీరు అందక పంటలు ఎండిపోయినా ప్రభుత్వం ‘ఎల్ నినో ఎఫెక్ట్’ అని నెపం నెట్టేస్తోందని, కానీ మద్యం ఉత్పత్తి మరియు అమ్మకాల పెంపు విషయంలో మాత్రం ఎల్ నినో అడ్డురాకపోవడం విడ్డూరంగా ఉందని అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్ అందించడానికి ఎల్ నినో ఎఫెక్ట్ అడ్డు వస్తున్నప్పుడు, మద్యం విక్రయాలు పెంచి ఖజానా నింపుకోవడానికి అదే ఎల్ నినో ఎందుకు అడ్డురావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజల, రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు. రేవంత్ సర్కార్ దృష్టి అంతా ప్రజల సంక్షేమంపై కాకుండా కేవలం మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపైనే ఉందనడానికి ప్రభుత్వ వైఖరే నిదర్శనమని ఆరోపించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>