కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఎయిర్‌పోర్ట్‌కు నడిచే పుష్పక్ ఏసీ బస్సుల (Pushpak Bus) ఛార్జీలను గరిష్టంగా రూ.150 వరకు తగ్గించింది. ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 7, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఛార్జీల తగ్గింపు ఇలా..
ఈ నిర్ణయంతో గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఛార్జీ రూ.300 నుంచి సగానికి తగ్గి రూ.150కి చేరింది. జేబీఎస్, జేఎన్టీయూల నుంచి రూ.350గా ఉన్న ఛార్జీ రూ.200కి, మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి రూ.250కి తగ్గింది. అలాగే లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ.300 నుంచి రూ.200కి ఛార్జీలను సవరించారు. వీటితో పాటు జేబీఎస్ నుండి మెహదీపట్నం, ఆరాంఘర్ మధ్య ఎంపిక చేసిన సర్వీసుల్లో ఛార్జీని రూ. 100గా నిర్ణయించడంతో నిత్యం ప్రయాణించే వారికి భారీ ఊరట లభించనుంది.

