ప్రతిపక్షాలను అణిచివేస్తున్న కాంగ్రెస్ సర్కార్: రసమయి

కలం, కరీంనగర్: ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి, గాలిపెల్లి, తాళ్లపల్లి, పత్తికుంటపల్లె గ్రామాలలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) పరామర్శించారు. ఆయా గ్రామాల్లో వృద్ధులను మహిళలను ఆప్యాయంగా పలకరించి అధైర్య పడకండి అంటూ భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ..  పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే నా ప్రయాణం అని అన్నారు. అధికారం కోసం కాదని..  ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం నిరంతరం నిలబడటమే తన లక్ష్యం అని అన్నారు. పదవులు వస్తాయి పోతాయి కానీ ప్రజలతో ఉన్న అనుబంధం,నమ్మకం ఎప్పటికీ స్థిర స్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.  అధికారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు అయిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలు, 420 హమీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పగటిపూట నిరంతరాయంగా కరెంటు వచ్చేదని.. ఎలాంటి రంది లేకుండా పంటలు పండించుకున్నారని రసమయి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ఉదయం 5 గంటలకు రావాల్సిన కరెంటు 8 గంటలకు వస్తోందని.. ఆ వచ్చిన కరెంటు కూడా నిలకడగా ఉండకుండా మధ్యాహ్నం మళ్లీ కోతలకు గురవుతోందని విమర్శించారు. రైతులందరి పరిస్థితి ఇలాగే దయనీయంగా తయారైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు పల్లె నర్సింహారెడ్డి, మండలంలోని ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>