అచ్చంపేటలో ఏసీబీ యాక్షన్.. ట్రెజరీ ఉద్యోగి అరెస్ట్

కలం, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ట్రెజరీ కార్యాలయంలో (Achampet Treasury Office) లంచం తీసుకుంటూ ఓ సీనియర్ అసిస్టెంట్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఉద్యోగులు వివిధ రకాల సెలవులు తీసుకున్నప్పుడు, అందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటేనే పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయంపై ఓ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో వివరాలు తెలుసుకున్న ఏసీబీ అధికారులు అచ్చంపేట ట్రెజరీ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్యపై రూ.25 వేల లంచం వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఆగస్టు 14న రూ.3 వేలు, ఆగస్టు 18న రూ.22 వేలను ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు ఉన్న ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అనంతరం వెంకటయ్యను అరెస్ట్ చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>