అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు: కుంభం అనిల్

కలం, భువనగిరి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) స్పష్టం చేశారు. భువనగిరి పట్టణంలోని రావి భద్రారెడ్డి గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ, మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలనలో భాగంగా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. భువనగిరి నియోజకవర్గానికి కొత్తగా 13 వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయని, వీటి ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ సులభతరం కావడమే కాకుండా, ప్రభుత్వం అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, భువనగిరి PACS చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి, చందుపట్ల PACS చైర్మన్ జీలుగు సతీష్ పవన్, ఏఎంసీ చైర్‌పర్సన్ శ్రీరేఖ, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>