సేవా సంకల్ప అభియాన్ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి: బీజేవైఎం

కలం యాదగిరిగుట్ట: సేవా జ్యోతి కలశ్ యాత్ర పేరిట నిర్వహిస్తోన్న బైక్ ర్యాలీని (BJYM Bike Rally) విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మేకల పాండు యాదవ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ 25 ఏళ్ళ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట టౌన్‌లో బీజేపీ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధికి చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాండు యాదవ్ తెలిపారు. సేవా జ్యోతి కలశ్ యాత్రలో భాగంగా ఈ నెల 7న భువనగిరిలో నిర్వహించనున్న బైక్ ర్యాలీలో యాదగిరిగుట్ట టౌన్‌కు చెందిన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షులు కర్రె ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు పలుగుల సురేష్, మందోజు నరేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బండి మహేష్, జిల్లా కార్యదర్శి బోడ బుచ్చిబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>