కలం, భైంసా: ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి నిధులు విడుదలవుతున్నప్పటికీ భైంసా (Bhainsa) పట్టణంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని పలువురు బీజేపీ (BJP) నాయకులు ఆరోపించారు. మంగళవారం భైంసా మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని పలు బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మున్సిపాలిటీకి నిధులు వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ముధోల్ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం లేదని విమర్శించారు. నిధుల వినియోగం, చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

