కలం, నిర్మల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతర ప్రజా సేవ, సుపరిపాలనను పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బుధవారం సేవా జ్యోతి కలశ యాత్ర (Seva Jyoti Kalash Yatra) నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తెలిపారు. శివాజీ చౌక్‌లోని ఆర్‌కే కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎల్‌ఈడీ తెరపై ప్రధాని మోదీ ప్రసంగాన్ని పార్టీ శ్రేణులు సామూహికంగా వీక్షిస్తారని తెలిపారు. అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా జ్యోతి కలశ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

