జమ్ములమ్మ దర్శనానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదం

కలం, వనపర్తి: వనపర్తి మండలం పెద్దగూడెం తండా (Peddagudem Thanda) స్టేజీ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి వనపర్తికి వస్తున్న వనపర్తి డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు ఉదయం సుమారు 8.15 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.

వనపర్తి జంగాలగుట్టకు చెందిన బుడగజంగాల కుటుంబ సభ్యులు గద్వాల జమ్ములమ్మ తల్లిని దర్శించుకునేందుకు వనపర్తి నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరెంతమంది గాయపడ్డారు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>