శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎమ్ కట్ చేసి డబ్బులు లూటీ!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో భారీ చోరీ (Shamshabad ATM Theft) వెలుగు చూసింది. అర్దరాత్రి ఏటీఎంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మిషన్‌ను దారుణంగా ధ్వంసం చేసి, అందులో ఉన్న దాదాపు రూ. 32 లక్షల నగదును కాజేసి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఏటీఎం ధ్వంసమై ఉండటాన్ని గమనించిన స్థానికులు, బ్యాంకు అధికారులు వెంటనే శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కీలక ఆధారాలను సేకరించాయి. దొంగలు పక్కా ప్రణాళికతోనే గ్యాస్ కట్టర్‌తో ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా ఈ దారుణానికి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కేసుపై కేసు నమోదు చేసి ఏటీఎం సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>