స్థానిక సమరానికి సై.. నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Elections) సన్నాహాల్లో భాగంగా అధికార కూటమి నాయకత్వం వేగం పెంచింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో పాటు ప్రతినిధులు పాల్గొని రాబోయే స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ కీలక భేటీలో ప్రధానంగా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు, మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల కేటాయింపు , ఉమ్మడి అభ్యర్థుల ఎంపికపై స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణలు రాకుండా సమన్వయ కమిటీల ద్వారా పనిచేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో రిలీజ్ కానున్న వేళ సీఎం, డిప్యూటీ సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>