చైనా ఓపెన్ నుంచి మద్వదేవ్ ఔట్

కలం, స్పోర్ట్స్ : చైనా ఓపెన్‌లో డానియల్ మద్వదేవ్‌ (Daniil Medvedev) కు భారీ షాక్ తగిలింది. క్​షణికావేశానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు ఈ రష్యన్ స్టార్. సోమవారం జకోవిచ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రేక్షకుడిని గాయ పరిచినందుకు మద్వదేవ్‌ డిస్‌క్వాలిఫై అయ్యాడు. మ్యాచ్ 7–5, 5–3 దగ్గర జకోవిచ్ సర్వింగ్ చేశాడు. కొంతసేపటి తర్వాత మద్వదేవ్ పాయింట్ కోల్పోయాడు.. కోర్ట్ వెనక స్టాండ్‌కు తగిలి వచ్చిన బంతిని బలంగా కొట్టాడు. ఆ బంతి ప్రేక్షకుల్లో ఉన్న ఒక ఫ్​యాన్‌ ఎడమ కంటికి గట్టిగా తాకింది.

వెంటనే స్పందించిన మెడికల్ స్టాఫ్.. ప్రేక్షకుడికి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనతో ఆటను అక్కడే ఆపేసి మద్వదేవ్‌తో అధికారులు చర్చించారు. అనంతరం రష్యన్ స్టార్‌‌ను మ్యాచ్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. ఈ ఘటనపై స్పందించిన జకోవిచ్.. తాను కూడా షాక్ అయ్యానని, ఒక్క క్షణం తనకేం అర్థం కాలేదని అన్నాడు. ‘‘ఫ్​యాన్‌కు అంత సీరియస్ గాయం కాలేదని అనుకుంటున్నా. అదే సమయంలో మద్వదేవ్‌ను చూసీ బాధ పడ్డాను. తను కావాలని అలా చేయలేదు” అని అన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>