యాదాద్రిలో ఐఏఎస్ అధికారి దేవేశ్ దేవల్ పూజలు

కలం, యాదగిరిగుట్ట: కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దేవేశ్ దేవల్ (IAS Devesh Deval) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న దేవేశ్ దేవల్‌కు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>