కలం, కరీంనగర్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) కరీంనగర్ (Karimnagar) జిల్లా మేనేజింగ్ కమిటీకి నూతన కార్యవర్గం ఎన్నికైంది. డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంలో చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్‌గా రాధాకృష్ణారెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్‌గా కుందారపు మహేశ్వర్, కోశాధికారిగా గోనె శ్రీనివాస్, చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా పెండ్యాల కేశవరెడ్డి ఎన్నికయ్యారు.
అదే విధంగా డైరెక్టర్లుగా రాగి శ్రీనివాస్, రాజిరెడ్డి, కాన్పర్తి మనోహర్ రావు, యూత్ కోఆర్డినేటర్‌గా మొగలోజు రాకేష్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీందర్ సింగ్, పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు, రెడ్ క్రాస్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

