మెరిట్ ఉన్నా దివ్యాంగుడికి దక్కని ఉద్యోగం

కలం, నిర్మల్: దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీలో తనకు అన్యాయం జరిగిందని సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామానికి చెందిన కె.రాజేశ్వర్ సోమవారం ఆర్డీవో కార్యాలయం (Nirmal RDO Office)లో నిరసన తెలిపారు. అంబేద్కర్ చిత్రపటంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని వెంటబెట్టుకుని కార్యాలయానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. 2015లో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని.. తాను మెరిట్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నా.. తర్వాత స్థానాల్లో ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు.

అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన రాలేదని రాజేశ్వర్ ఆవేదన చెందారు. జిల్లాల పునర్విభజన అనంతరం కూడా నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, తనకు ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>