వెలగని సెంట్రల్ లైట్లు.. వాహనదారుల ఇబ్బందులు!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి సెయింట్ థామస్ స్కూల్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లు కొద్ది రోజులుగా వెలగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో చీకటి అలుముకోవడంతో ప్రమాదాల భయం నెలకొంది. సెంట్రల్ లైట్లు వెలగడం లేదని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడం మరింత ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు. చీకటి కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సెంట్రల్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>