ఓటు హక్కు పరిరక్షణ.. కలెక్టరేట్ ముట్టడికి ఇండియా కూటమి పిలుపు

కలం, నారాయణపేట : ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో అవకతవకలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఇండియా కూటమి (INDIA Bloc) పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు కాశినాథ్ మాట్లాడారు.

దేశంలో ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా, ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేకంగా SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు సరైన అవకాశం కల్పించాలని, మరణించిన, డూప్లికేట్ వంటి అనర్హమైన నమోదులను నిబంధనల ప్రకారం పరిశీలించడంతో పాటు, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం, జిల్లా కలెక్టరేట్ (Collectorate) ముట్టడి కార్యక్రమంను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవిఎం గోదాం నుండి ప్రారంభమయ్యే కార్యక్రమం ఓల్డ్ బస్‌స్టాండ్,సివిల్ లైన్స్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇండియా బ్లాక్‌లోని మిత్రపక్షాలు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, యువత, మహిళలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎండి.సలీం, సదా శివారెడ్డి, బండి వేణుగోపాల్, సుధాకర్, సంతోష్ కుమార్, వెంకటేష్ గౌడ్, కోట్ల.రవీందర్ రెడ్డి, మహిమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్ సీపీఐ(ఎం)నాయకులు బలరాం సీపీఐ(ఎంఎల్) కెంచి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>