బీజేపీ ఎస్టీ మోర్చా బలోపేతానికి కృషి చేయాలి.. సునీల్ రావు సూచన!

కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా (State Executive Member) గుగులోతు విజయ దేవి (Gugulothu Vijaya Devi) నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ఎస్టీ మోర్చా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. తనకు ఈ పదవి లభించడం పట్ల ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుగులోతు విజయ దేవి సంతోషం వ్యక్తం చేశారు. తనను సన్మానించిన యాదగిరి సునీల్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>