హనుమకొండలో కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ

కలం, హనుమకొండ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ పేరిట హనుమకొండలో కాంగ్రెస్‌ (Hanumakonda Congress) ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఈ కార్యక్రమం సాగింది. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, కుడా ఛైర్మన్‌ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రకు ముందు ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ శ్రేణులు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ఓటు హక్కును పరిరక్షించాలి’ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేపట్టారు.

జ్ఞానేష్ కుమార్‌పై విచారణ చేయాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై సమగ్ర విచారణ జరిపి, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర అనంతరం కాంగ్రెస్‌ శ్రేణులు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి దుద్దిళ్ల శ్రీనుబాబు, హుజురాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఒడితల ప్రణవ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>