భీమ్‌గల్ PS ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!

కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా భీమ్‌‌గల్ పోలీస్ స్టేషన్‌ (Bheemgal Police Station) ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడిని భీమ్‌గల్ పట్టణంలోని చిన్న హోటల్ నడుపుకుంటున్న సుధాకర్‌గా గుర్తించారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాధితుల కథనం ప్రకారం.. సుధాకర్ అనే వ్యక్తి భీమ్‌గల్ పట్టణంలో చిన్న హోటల్ నడుపుకుంటున్నాడు. రాత్రి 10 గంటల తర్వాత కూడా హోటల్ బయట టేబుళ్లు వేసి ఉంచడంతో, భీమ్‌గల్ పోలీసులు ఆ టేబుళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఆ సమయంలో ఇంకోసారి తప్పు చేయను అని సుధాకర్ బతిమిలాడాడని, అయినా పోలీసులు వినలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయినప్పటికీ పోలీసులు వినకుండా సుధాకర్‌పై భీమ్‌గల్ ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై సోమవారం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు సుధాకర్‌ను ఉదయం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ తాను వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>