‘ఛలో జంతర్ మంతర్’ కు అభిజీత్ దీప్కే పిలుపు

కలం, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా రెండవ విడత పోరాటానికి అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. తమ నిరసన పూర్తిగా గాంధేయ మార్గంలో, శాంతియుతంగా సాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతీ పౌరుడు ఈ ‘ఛలో ఢిల్లీ’ ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరారు. ఈ మేరకు అందరూ బ్యాగులు సర్దుకుని అక్టోబర్ 10న ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.

అభిజీత్ దీప్కే ఇటీవల ముంబై శివాజీ పార్క్ లో ఏర్పాటు చేసిన సభకు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. దీంతో అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>