ఆసియా క్రీడల్లో స్వర్ణంపై సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్​ : ఆసియా క్రీడల్లో పాకిస్తాన్‌పై సాధించిన స్వర్ణ పతకం తమకేమీ ఊరికే రాలేదని భారత వికెట్ కీపర్ సంజూ శామ్సన్ (Sanju Samson) అన్నారు. ఈ విజయం వెనుక ఆటగాళ్ల తీవ్ర శ్రమ ఉందని చెప్పారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అర్ధసెంచరీలతో భారత్ 211 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ నిలబెట్టుకుంది. జట్టులోని అనుభవజ్ఞులైన ఆటగాళ్లే ఈ ఒత్తిడిని జయించడంలో కీలక పాత్ర పోషించారని శామ్సన్ తెలిపారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ పసిడి పతకం తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>