కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా-ఏ జట్టు తో తలపడనున్న భారత-ఏ జట్టు (India A Squad) లో కీలక మార్పు జరిగింది. నమన్ ధీర్ స్థానంలో అనుకూల్ రాయ్‌కు పిలుపొచ్చింది. వెస్టిండీస్‌తో జరగనున్న సీనియర్ జాతీయ టీ20 మ్యాచ్ జట్టులోకి సమన్ ధీర్ ఎంపికయ్యాడు. దీంతో అతడి స్థానంలో భారత-ఏ జట్టులోకి అనుకూల్‌కు అవకాశం దొరికింది. దీంతో శ్రీనగర్‌లో ఇరానీ కప్‌లో ఆడుతున్న అనుకూల్ రాయ్, వెంటనే పుదుచ్చేరి చేరుకుని భారత్-ఎ జట్టులో చేరారు.
భారత్-ఎ జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, కుమార్ కుషాగ్రా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, గుర్జాప్‌నీత్ సింగ్, యశ్ ఠాకూర్, సూర్యాంశ్ షెడ్గే, అనుకూల్ రాయ్.

