కలం, ఖమ్మం బ్యూరో: మధిర (Madhira) నియోజకవర్గంలో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హెచ్చరించారు. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో అధికారులు పూర్తి బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా జమలాపురంలో కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి నిర్వహించిన శాఖల సమీక్షలో మాట్లాడారు.
రూ.59.67 కోట్లు మంజూరు..
మధిర నియోజకవర్గంలో 9 పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు రూ.59.67 కోట్లు మంజూరు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గుర్తు చేశారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెప్మా ద్వారా మధిరలోని 10 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. బ్రిడ్జిల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పూర్తి చేయాలన్నారు. రహదారుల విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలను త్వరితగతిన తరలించాలని సూచించారు. రైతుల ఫిర్యాదులకు తావులేకుండా భూ రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి రికార్డులు జాగ్రత్త చేయాలన్నారు.
Also Read : దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోండి.. మోదీకి కవిత రిక్వెస్ట్
Follow Us On: X(Twitter)

