బహుజన సభను విజయవంతం చేయాలి: జగన్ మోహన్

కలం, నిర్మల్: ఈ నెల 9న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సంకల్ప సభ (Bahujana Meeting)ను విజయవంతం చేయాలని ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సారంగాపూర్ మండలం ప్యారామూరు గ్రామంలో సంకల్ప సభ పోస్టర్లు ఆవిష్కరించారు.

పూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అణగారిన వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని జగన్ మోహన్ పిలుపునిచ్చారు. బహుజనుల హక్కుల సాధన, సామాజిక సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ యాదవ్, నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షుడు క్యాతం సాగర్, నాయకులు రాజేష్, దత్తు, సాగర్, సునంద తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>