ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం: బీసీ సంఘం

కలం, వెబ్ డెస్క్: జాతియ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా బీసీలు రోడ్లెక్కి ఉద్యమిస్తుంటే కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి అధ్యక్షతన జరిగిన బీసీ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనెల 8న ఢిల్లీలో జరిగే జాతీయ అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కుట్రతోనే కేంద్రం చేర్చడం లేదు..

అనంతరం శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) మాట్లాడుతూ.. ఓబీసీ కులాల లెక్కలు తీయాలంటే కేంద్రం గడగడా వణికిపోతుందని దుయ్యబట్టారు. బీసీల లెక్కలు తేలితే తమకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని కుట్రతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చడం లేదని ఆరోపించారు. ఓబీసీ కాలం చేర్చాలని ప్రధాన డిమాండ్ తో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామన్నారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు, గెజిట్ నోటిఫికేషన్లు చించివేత, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్మ పోరాట దీక్షలు, నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం చూస్తే బీసీలు అంటేమోడీకి గిట్టదని తేలిపోయిందని విమర్శించారు.

బహిరంగంగా ప్రకటిస్తాం..

దేశంలోని 60 శాతం ఉన్న ఓబీసీలను జెండాలు మోహించుకుంటూ జిందాబాద్ లు కొట్టించుకొని ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు.. తమ విధానపరమైన వైఖరిని ఈనెల 8లోగా స్పష్టంగా వెల్లడించాలన్నారు. లేనిపక్షంలో 8వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో ‘ఓబీసీలకు కాలమ్’ ఉద్యమానికి మద్దతు తెలపని రాజకీయ పార్టీలను బహిరంగంగా ప్రకటిస్తామన్నారు. ఆ పార్టీలను రాజకీయంగా భూస్థాపితం చేయడానికి తమ ఉద్యమ కార్యచరణ ఉంటుందని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>