అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించాలి : భాస్కర్ రావు

కలం, మిర్యాలగూడ : రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చొరవ చూపాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు (Bhaskar Rao) పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. పట్టణంలోని 48 వార్డుల్లో ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తూ అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లకు సహకరించేందుకు వీలుగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లను అందుబాటులో ఉంచామన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లమోతు (Bhaskar Rao) కోరారు. పట్టభద్రుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ ప్రాతినిధ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, ఎండి. ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస గౌడ్, ఎండి. మగ్దుం పాషా, పెండ్యాల పద్మావతి, షెహానాజ్ బేగం, పునాటి లక్ష్మీనారాయణతో పాటు 48 వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్‌లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>