ఖమ్మంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ

​కలం, మధిర: కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరికి నిరసనగా ఇండియా కూటమి (INDIA Alliance) ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 8న ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు , సీపీఐ, సీపీఎం నేతలు తెలిపారు. ఆదివారం మధిరలో మీడియా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 8న ఉదయం 10 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి గ్రామం నుంచి అన్ని పార్టీల నేతులు వేలాదిగా తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు పారుపల్లి విజయ్ కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, బెజవాడ రవికుమార్, శీలం నరసింహారావు, ఏలూరి సత్యనారాయణ రెడ్డి, బట్ అంజన బాబు, మందా సైదులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>