కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) (Daram Supriya) ఉద్యోగ రీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న భారత్కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సుప్రియ మృతితో మరిపెడలోని విషాద ఛాయలు అలముకున్నాయి.

