మేడ్చల్‌లో అగ్నిప్రమాదం: ఫర్నిచర్ దుకాణాలు దగ్ధం

కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద భారీ అగ్నిప్రమాదం (Medchal Fire Accident) సంభవించింది. రోడ్డు పక్కన ఉన్న ఒక ఫర్నిచర్ షాపులో మొదలైన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న మరో దుకాణానికి వ్యాపించాయి. ఫర్నిచర్ వస్తువులు కాలడంతో దట్టమైన పొగ కమ్ముకుని ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేసింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు పక్కనున్న ఇతర దుకాణాలకు విస్తరించకుండా అడ్డుకోగలిగారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>