వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం: డీఅర్డీఓ

కలం, ఆదిలాబాద్: వృద్ధులను గౌరవించడం మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమని డీఆర్డీఓ రాథోడ్ రవీందర్ అన్నారు. వారి జీవిత అనుభవాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సెర్ప్ వృద్ధుల మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమం ద్వారా శనివారం స్థానిక టీటీడీసీలో(Adilabad TTDC) అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించారు. వృద్ధులకు అవసరమైన సహాయం, సేవలను అందించేందుకు అందుబాటులో ఉన్న ఎల్డర్ లైన్ టోల్‌ఫ్రీ నంబర్ 14567 గురించి వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా వృద్ధులకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలోని వృద్ధుల సంఘాల్లో పనిచేస్తున్న జిల్లా, మండల సమాఖ్యల అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. వృద్ధుల సంక్షేమం కోసం వారు చేస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వృద్ధుల సంఘం అధ్యక్షుడు దేవీదాస్ దేశ్‌పాండే, అడిషనల్ ఏపీఐడీ సునందన్, డీపీఎంలు, ఏపీఎంలు, వివిధ మండలాల మండల సమైక్య అధ్యక్షులు, సిబ్బంది, వృద్ధుల మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>