సత్తుపల్లిలో సందడిగా ఇళ్ల పట్టాల పంపిణీ

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం ఇళ్ల పట్టాల పంపిణీ సందడిగా సాగింది. పేదలకు పట్టాలు, మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయల నిధులతో శంకుస్థాపనలు జరగడంతో శనివారం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti)  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​

తల్లాడ మండలం పిన్నపాక గ్రామంలో 79 మంది అర్హులైన మహిళా లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి వివరించారు. ఇప్పటికే 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు…

​అనంతరం సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలోని పలు వార్డుల్లో రూ.1.74 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి భూమిపూజ చేశారు. సత్తుపల్లిలోని 1, 12, 14 వార్డుల్లో రూ.1.30 కోట్లు, కల్లూరులోని 17వ వార్డులో రూ. 44.50 లక్షల వ్యయంతో చేపడుతున్న రోడ్లు, డ్రెయిన్ల పనులను ప్రారంభించారు. ​సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మొదటి విడత కింద 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ దివాకర టీఎస్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మున్సిపల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>