కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో శనివారం వనరుల సమీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ప్రభుత్వ భూముల విలువను పెంచడం, హెచ్ఐఎల్టీ (HILT) పాలసీ అమలును వేగవంతం చేయడంతో పాటు టూరిజం డిపార్ట్ మెంట్ ను కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దడం చర్చించారు. రాబోయే గ్లోబల్ సమ్మిట్‌లో టూరిజంలో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు 70 నుంచి 80 సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (DPRs) సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

