కలం, వెబ్ డెస్క్: ఎన్నికల్లో పోటీపై ఎంఐఎం కీలక నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, పోటీ చేసే ఆలోచన కూడా లేదు అని స్పష్టం చేశారు. నగర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ననిలిచే మజ్లిస్ ఫ్లోర్ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని పాతబస్తీ, రాష్ట్ర రాజకీయాల్లో అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై చర్చలు మొదలయ్యాయి.
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ శాసనసభాపక్షనేతగా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తున్నారు. ఈయన చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్నారు. తొలుత 1999లో చాంద్రాయణగుట్ట నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2004, 2009,2014, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

