బాసర శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కలం, భైంసా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు (Sharannavaratri Utsavam) ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను ఆలయ ఈవో, పూజారులు(Basara Temple Priests) ఆహ్వానించారు. శనివారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలు, భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యేకు వివరించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>