పామాయిల్ గెలల దొంగల ప్లాన్ ఫెయిల్!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పామాయిల్ గెలలు అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్ల ప్లాన్ ఫెయిల్ అయింది. ముఠా గుట్టును దమ్మపేట పోలీసులు (Dammapeta Police) రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు ఆటోలు, పామాయిల్ గెలలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ డీఎస్పీ తెలిపారు. ​దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు గెలలను తరలించే క్రమంలో అక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆయనదే కీలక పాత్ర..

బుగ్గపాడు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బత్తిన రాము, ట్రాక్టర్ డ్రైవర్లు గడ్డం మహేంద్ర, కీసరి నాగరాజు, నాగబాబు తదితరులు నాలుగు నెలలుగా యజమానులకు తెలియకుండా ఇలా గెలలను దించి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఈ దందాలో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డు పొట్ట ముత్యాలరావు కీలక పాత్ర పోషించారు. జక్కా బాలు, కారం వెంకటేష్, పుల్లారావు నగదు లావాదేవీలకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కేసును ఛేదించిన అశ్వారావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్‌ఐ బాలస్వామి, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>