కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని నటరాజనగర్లో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ నివాసంలో శనివారం పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్ స్వామివారికి పాదపూజ (Pada Puja) నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పాదపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం జీయర్ స్వామివారు భక్తులకు దివ్య ఆగమన తీర్థ గోష్ఠి, అనుగ్రహ భాషణం, ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పురోహితులు రామకృష్ణ కన్నన్, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సుధాకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, కౌన్సిలర్ సాధం స్వప్న అరవింద్, నర్సారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

