దాసరి ఉష అనుచరులపై దాడి.. తీవ్ర గాయాలు!

కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దాసరి ఉష (Dasari Usha), దాసరి మనోహర్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విబేధాలు భగ్గుమన్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌‌ రెడ్డి బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. దాసరి ఉష వర్గానికి ఈ సమావేశంపై సమాచారమివ్వికపోవడంతో.. ఇదే విషయాన్ని సమావేశం వద్దకు వెళ్లి అడగడంతో ఘర్షణ నెలకొంది. గత ఎన్నికల్లో మనోహర్ రెడ్డి ఓడిపోవడానికి ఉష వర్గమే కారణమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో అబ్దుల్ మల్లిక్, బీరం రవి అనే వ్యక్తులపై కర్రలతో దాడి చేయగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే..

తన వర్గీయులపై దాడి ఘటనపై దాసరి ఉష స్పందించారు. దాసరి మనోహర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ.. సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని అడిగినందుకే విచక్షణరహితంగా కొట్టారన్నారు. మనోహర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే అవడానికి బీసీ నేతల తలలు పగలగొడుతున్నారని.. ఇక నుంచి బీసీల శక్తి ఏంటో చూపిస్తామన్నారు. ఈ మేరకు దాసరి మనోహర్ రెడ్డితో పాటు దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో దాసరి ఉష ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరుల్లో ఒకరైన దాసరి ఉష.. 2024లో ఆయనతో పాటే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న ఆమెకు, అప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న దాసరి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>