కలం, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం (Eturnagaram) ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేపాయి. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను గుర్తించి, వారి వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో గుడి దీక్షిత్, రాంచరణ్ తేజ్, అంకుల వంశీ, వరప్రసాద్‌లను గుర్తించినట్లు సమాచారం. వీరిలో గుడి దీక్షిత్, అంకుల వంశీ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సుమారు 1,100 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాల మూలాలు, వాటిని సరఫరా చేస్తున్న వ్యక్తులు, కొనుగోలుదారుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

